దీన్‌దయాళ్‌ చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలి

26 Sep, 2016 00:01 IST|Sakshi
దీన్‌దయాళ్‌ చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలి

సూర్యాపేట : పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జీవిత చరిత్రను పాఠ్యంశాల్లోకి చేర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి అన్నారు. ఆదివారం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని టీపీయూఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక స్పందన డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్‌దయాల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఆయన  ప్రముఖ మేధావి, కార్యశూరుడు, రాజకీయ వేత్త, ఆర్థికవేత్త, విలువలతో కూడిన జీవన విధానం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. వీరి జీవిత విశేషాలను ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని తరగతుల పాఠ్యాంశాల్లో చేర్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థినీ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల శ్రీనివాస్, యామా రమేష్, గుజ్జె జయప్రకాష్, బ్రహ్మచారి, నరసింహ, పూల్‌సింగ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు