భువనగిరిలో డీఐఈఓ కార్యాలయం

5 Oct, 2016 22:35 IST|Sakshi
భువనగిరిలో డీఐఈఓ కార్యాలయం
భువనగిరి అర్బన్‌ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కార్యాలయం(డీఐఈఓ) ఏర్పాటు చేయనున్నట్లు  ఆర్‌ఐఓ ఎన్‌.ప్రకాష్‌బాబు అన్నారు. బుధవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉన్న వృత్తి విద్యా సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వృత్తి విద్యా సముదాయ భవనంలో అక్టోబర్‌ 11 నుంచి డీఐఈఓ విధులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యాలయానికి  కావాల్సిన రికార్డులు, ఫర్నిచర్, కార్యాలయం పేరుతో ఉన్న బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది నియామకం కూడా త్వరంలోనే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంటర్‌మీడియట్‌ విభాగంలో ఉన్న ఆర్‌ఐఓ, డీవీఈఓ పోస్టులు రద్దవుతాయని, ఈ పోస్టుల్లో డీఐఈఓ ఏర్పడుతుందని చెప్పారు.  నూతన యాదాద్రి జిల్లాలో 69 జూనియర్‌ కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 4 టీఎస్‌డబ్ల్యూఆర్‌సీ, 1 టీఎస్‌ఆర్‌జేసీ, 6 మోడల్‌ స్కూల్స్, 48 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయన్నారు. ఆయన వెంట పలువురు అధ్యాపకులు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు