ఫ్రీగా వస్తే..

1 Jan, 2017 22:38 IST|Sakshi
ఫ్రీగా వస్తే..
చాపాడు: ఫ్రీగా వస్తే ఫినాయిల్‌ అయినా తాగుతారు అంటూ కొందరిని ఉద్దేశించి అంటుంటాం.. అవును అలాంటి సంఘటనే ఇది.. డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడి డ్రైవర్‌.. క్లీనర్‌ ఆసుపత్రి పాలైతే​.. అయ్యో..పాపం అంటూ సానుభూతి చూపాల్సింది పోయి.. మీరేమైపోతే మాకేం.. అంటూ కొందరు కక్కుర్తిపరులు బోల్తాపడిన డీజిల్‌ ట్యాంకర్‌ నుంచి డీజిల్‌ను ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. ఇలా డీజిల్‌ తీసుకెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఈ దృశ్యాన్ని చూసి ఆ దారిన వెళ్లేవారు సైతం మేమేం తక్కువ తిన్నామా అంటూ వారికి అందుబాటులో ఉన్న క్యాన్లు, బాటిళ్లలో డీజిల్‌ను తీసుకుని వెళ్లారు. కొందరు లీటరు బాటిల్‌ తెచ్చుకుంటే మరికొందరు ఐదులీటర్లు.. ఇంకొందరు ఏకంగా 20 లీటర్ల క్యాన్లు.. ప్లాస్టిక్‌ బిందెలు తీసుకొచ్చి డీజిల్‌ తీసుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చాపాడు మండలం నాగులపల్లె వద్ద డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ ఆసుపత్రి పాలు కాగా, ఇలా కొందరు డీజిల్‌ ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివశంకర్‌ అక్కడ పోలీసులను నియమించడంతో డీజిల్‌ ఎత్తుకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌