నేరాల నియంత్రణపై నిఘా పెంచాలి

11 Feb, 2017 22:46 IST|Sakshi

హిందూపురం అర్బన్‌ : నేరాల నియంత్రణపై నిఘా పెంచి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్‌  డీఐజీ ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసి పెండింగ్‌ కేసుల పురోగతి విషయాలపై ఆరా తీశారు. ఫిర్యాదులు రాకుండా విధి నిర్వహణలు సక్రమంగా చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. డీఎస్పీ సుబ్బారావు, సీఐలు మధుభూషన్, ఈదూర్‌బాషా, రాజగోపాల్, ఎస్‌ఐలు ఆయన వెంట ఉన్నారు.

మరిన్ని వార్తలు