దిమ్మగుడి వార్డెన్‌ సస్పెండ్‌

14 Oct, 2016 23:04 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సాంఘిక సంక్షేమ శాఖ దిమ్మగుడి హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(వార్డెన్‌) డీఎస్‌ మహబూబ్‌షరీఫ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గహం నిర్వహణలో నిర్లక్ష్యం, నిత్యావసర సరుకుల దారి మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏఎస్‌డబ్ల్యూఓతో విచారణ చేయించారు. ఉప సంచాలకులు రోశన్న నివేదిక సమర్పించిన అనంతరం సస్పెండ్‌ చేశారు.

15 రోజుల్లో ఇద్దరు
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకపోవడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై ఫిర్యాదులు రావడంతో ఇటీవల ఉరవకొండ ఎస్సీ బాలికల వసతి  గహం వార్డెన్‌ సుజాతను సస్పెండ్‌ చేశారు. తాజాగా దిమ్మగుడి వార్డెన్‌పై వేటు పడింది. 15 రోజుల వ్యవధిలో సాంఘిక సంక్షేమ శాఖ వార్డెన్లు ఇద్దరు సస్పెన్షన్‌ కావడం చర్చనీయాంశమైంది.

అధికారుల పర్యవేక్షణ కరువు
ఎవరో ఫిర్యాదు చేసిన తర్వాత ఉన్నతాధికారులు విచారణ చేయించి చర్యలు తీసుకోవడం తప్పితే సంబంధిత అధికారులు తమ పరిశీలనలో లోటుపాట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కానరావడం లేదు. కొందరు అధికారులు వార్డెన్లతో నెలనెలా మామూళ్లు తీసుకుంటూ ఉండటం వల్లే చూసీచూడనట్లు వెళ్తున్నారని, వారి దష్టికి ఫిర్యాదులు వచ్చినా తొక్కి పెడుతున్నారని ఆరోపణలున్నాయి. అందువల్లే ఫిర్యాదులు నేరుగా ఉన్నతాధికారులకు వెళ్తున్నాయని, వారు స్పందించి చర్యలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. వార్డెన్లపైనే కాకుండా వారి వద్ద మామూళ్లు మరిగిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు