నాగర్‌కర్నూల్: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ జన్మదిన వేడుకలను గురువారం వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ– ఏ హాస్టల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి పాటలపోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం అధ్యక్షుడు వాస రాఘవేంర్ మాట్లాడుతూ శంకర్ భారతీయుడు, అపరిచితుడు వంటి దేశభక్తి చిత్రాలు తీశారని, ఆయన మరిన్ని దేశభక్తి చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోదండరాములు, శశికళ, వార్డెన్ రామస్వామి పాల్గొన్నారు.