పార్లమెంట్‌లో వికలాంగుల బిల్లు ప్రవేశపెట్టాలి

27 Aug, 2016 22:40 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: వికలాంగులకు ప్రయోజనం కలిగించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని పలు సంఘాల నాయకులు అన్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో “నూతన చట్టం అమలు–అభ్యంతరాలపై’ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూనాయక్‌ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం రూపొందించిన 1995యాక్ట్‌ నేటికీ అమలు కావడం లేదన్నారు. వికలాంగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

అధికారంలోకి వచ్చిన వెటనే బిల్లు చేస్తామని చెప్పిన బీజెపి ప్రభుత్వం దాని ఊసెత్తడం లేదన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. డీఓపీటీ శాఖ వికలాంగులకు రిజర్వేషన్ల అభ్యంతరాలను వ్యక్తం చేయడం తగదని, వికలాంగులకు ఏ ఉద్యోగమైనా చేయగలిగే సత్తా ఉందన్నారు. కార్యక్రమంలో కస్తూరి జయప్రసాద్, రాంబాబు, వల్లభనేని ప్రసాద్, లక్ష్మీనారాయణ, నండూరి రమేష్, రాఘవన్, రాజేందర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు