నారాయణ కాలేజీలో విద్యార్థుల మద్య ఘర్షణ

26 Aug, 2015 00:23 IST|Sakshi
నారాయణ కాలేజీలో విద్యార్థుల మద్య ఘర్షణ

విశాఖపట్టణం: నగరంలోని నారాయణ జూనియర్ కాలేజీ లో విద్యార్థులు రెండు వర్గాలు చీలిపోయి కొట్టుకున్నారు. ఈ ఘటన వైజాగ్‌లోని అసిలిమెట్ట నారాయణ జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ వర్గం విద్యార్థులు మరో వర్గం విద్యార్థులపై దాడి చేయడంతో ఈ వివాదం మొదలైనట్లు సమాచారం.  దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

 

పోలీసులు పలువరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే కళాశాల యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు