మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

3 Sep, 2016 22:36 IST|Sakshi
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
భువనగిరి : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని స్థానిక యువటీం సభ్యులు కోరారు. ఈ మేరకు శనివారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు మట్టిగణపతులను అందజేశారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి స్థానిక బస్టాండ్‌ వద్ద ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువటీం సభ్యులు తంగెళ్ళపల్లి మోహన్, రంగ రంజీత్, సన్నీ, మాదాసు రిత్విక్, ఏనుగు వినీత్, పోత్నక్‌ సన్నీ, పెండెం లక్ష్మణ్, తదితరులు ఉన్నారు. పట్టణంలోని దేదేప్య హైస్కూల్‌లో విద్యార్థులకు మట్టి ప్రతిమలను ఆ పాఠశాల కరస్పాండెంట్‌ శేషగిరిరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ రంగారావు, శంకర్, వీరనాగేందర్, వనజ, బాలమణి, అర్చన, తదితరులు పాల్గొన్నారు. వాసవీక్లబ్‌ భువనగిరి ఆధ్వర్యంలో ఈ నెల 4న మట్టి గణపతి విగ్రహాలను అందజేస్తామని ఆ సంఘం అధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మినర్సయ్య తెలిపారు. పట్టణంలోని ప్రెసిడెన్సీలో పాఠశాలలో కూరగాయలు, రంగురంగుల కాగితాలు,  వివిధ రకాల పువ్వులతో గణేష్‌ విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెట్‌ డి.బాలాజీ, ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు