వీటినేం చేస్తారు సారూ?

12 Dec, 2016 14:45 IST|Sakshi
వీటినేం చేస్తారు సారూ?

పంపిణీకి నోచుకోని ‘ఎస్సారెస్పీ’ చేపపిల్లలు

బాల్కొండ : ప్రభుత్వం మత్స్య కారుల జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి చేప పిల్ల్లలను దిగుమతి చేసి వంద శాతం సబిడీపై చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగాన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలోని చేప పిల్లలను ఇప్పటి వరకు పంపిణీ చేపట్టలేదు. ఈ కేంద్రంతో ఉత్పత్తి చేసిన చేప పిల్లలను ఏం చేస్తారో అంటూ మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో 1.37 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. ఎస్సారెస్పీలో 4 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం వల్ల 1.37 కోట్లతోనే సరిపెట్టారు. వాటిని కుండీల్లో వేసి పెంచుతున్నారు. ప్రాజెక్ట్ నీటి ఆధారంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన చేప పిల్లలను జిల్లాతో పాటు ఆదిలాబాద్, నాందెడ్ జిల్లాల మత్స్య సహకార సంఘాలకు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేవారు. కానీ ప్రస్తుత సంవత్సరం చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ పూర్తరుు రెండున్నర నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క చేప పిల్లలను కూడా పంపిణీ చేయలేదు.

నిర్ణయం తీసుకోలేదు..
ఎస్సారెస్పీ చేప పిల్లల కేంద్రంలో ఈ సంవత్సరం 1.37 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి జరిగింది. వాటిపై ఉన్నత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. త్వరలోనే ఉన్నత అధికారుల అనుమతి తీసుకుంటాం.  - రాజానర్సయ్య, ఎఫ్‌డీవో, ఎస్సారెస్పీ

మరిన్ని వార్తలు