డీఈవో కార్యాలయం ముట్టడి

29 Jun, 2016 09:29 IST|Sakshi

ఆదిలాబాద్: జిల్లాలో నిబంధనలు పాటించకుండా ఇష్టారితీనా నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ప్రైవేటు పాఠశాలలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కో కన్వీనర్ మనోజ్ పవార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే ఎలాంటి అనుమతి లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న డీఈవో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీవో నంబర్ 1కు విరుద్దంగా ఫీజుల వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, షూలు, బెల్టులు, తదిర వస్తువులను విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. కాన్వెంట్, డీజీ, మాడల్, కాన్సెప్ట్, డిజిటల్ తదితర తోక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్శించి వారి నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ ‘మామూలు’గా తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరసనలో ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షాహజాది, జిల్లా నాయకులు రాజేష్, ప్రశాంత్, రవికాంత్, ప్రమోద్, నిఖిల్, సురేష్, కర్ణ, సర్వేష్, రత్నామాల పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు