25 నుంచి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌

13 Oct, 2016 00:56 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 25, 26, 27 తేదీల్లో అనంతపురంలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్‌సె్పౖర్‌ అవార్డు మొత్తం రూ.5 వేలు జమ అయిన వారు తప్పనిసరిగా ఈ ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. ఇప్పటిదాకా 160  మంది విద్యార్థులకు రూ.5 వేలు జమ అయిందని, తక్కిన వారికి ఈ వారంలోగా జమ కావచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థుల అకౌంట్లను పరిశీలిస్తూ ఇన్‌సె్పౖర్‌కు సన్నద్ధం చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు