పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

2 Nov, 2016 23:13 IST|Sakshi
పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
సామాజిక హక్కుల వేదిక నాయకుల పిలుపు
అమలాపురం టౌన్‌  : దేశ జనాభాలో అత్యధికులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం, మైనార్టీలను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్న పాలక పక్ష విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సామాజిక హక్కులవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా ప్రచార జీపుజాతా బుధవారం అమలాపురం వచ్చింది. వేదిక కోనసీమ కో ఆర్డినేటర్‌ కె.సత్తిబాబు ఆధ్వర్యంలో వేదిక ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జీపుజాతాకు స్వాగతం పలికారు. స్థానిక హైస్కూల్‌ సెంటర్లో జరగిన సభలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.ఈ వైఖరికి నిరసనగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదిక జిల్లా కన్వీనర్, జిల్లా సీపీఐ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తుండటం వల్ల ప్రభుత్వ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వేదిక అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్, రిపబ్లికన్‌ పార్టీ జాతీయ నాయకుడు డీబీ లోక్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అ««దl్యక్షుడు యిళ్ల సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు చెల్లుబోయిన కేశవశెట్టి, సామాజికవేత్త ఎంఏకే భీమారావు, కార్మిక నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు తదితరులు ప్రసంగించారు. తొలుత అంబేడ్కర్, ఫూలే చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళులర్పించారు. 
మరిన్ని వార్తలు