విద్యుత్‌ శాఖ క్రీడల్లో జిల్లా జట్ల ముందంజ

5 Oct, 2016 17:49 IST|Sakshi
విద్యుత్‌ శాఖ క్రీడల్లో జిల్లా జట్ల ముందంజ
గుంటూరు స్పోర్ట్స్‌: విద్యుత్‌ శాఖ రాష్ట్ర స్థాయి టెన్నిస్, బాస్కెట్‌ బాల్‌ క్రీడాపోటీలు ఫైనల్స్‌కు చేరాయి. గుంటూరు జిల్లా టెన్నిస్, బాస్కెట్‌ బాల్‌ జట్లు ప్రతిభ కనబరుస్తున్నాయి. మంగళవారం ఎన్టీఆర్‌ స్డేడియంలో టెన్నిస్‌ టీమ్‌ విభాగంలో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో గుంటూరు జిల్లా జట్టు 2–0 స్కోర్‌తో నెల్లూరు జిల్లా జట్టుపై, రెండో సెమీ ఫైనల్‌లో విశాఖపట్నం టీఎల్‌ అండ్‌ ఎస్‌ఎస్‌ జట్టు 2–0 స్కోర్‌తో హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధా జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాయి. బుధవారం జరిగే టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో గుంటూరు, విశాఖపట్నం జట్లు తలపడతాయి. బాస్కెట్‌ బాల్‌ విభాగం తొలి సెమీఫైనల్స్‌లో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ జట్టు 33–13 స్కోర్‌తో వైఎస్సార్‌ కడప జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్స్‌లో గుంటూరు జిల్లా జట్టు 39–30 స్కోర్‌తో విజయవాడ జట్టుపై గెలుపొందింది. బుధవారం ఉదయం గుంటూరు, రామగుండం జట్లు ఫైనల్స్‌లో తలపడతాయి. మధ్యాహ్నం స్థానిక కుందుల రోడ్డులోని గొంది సీతారామయ్య కల్యాణ మండపంలో క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్‌ఈ జయభారతరావు వెల్లడించారు.
మరిన్ని వార్తలు