త్వరలో మానుకోట జిల్లా ప్రకటన

31 Jul, 2016 00:47 IST|Sakshi
మహబూబాబాద్‌ : అందరి కృషితో త్వరలో మా నుకోట జిల్లా కాబోతుందని.. అధికారికం గా ప్రకటించడమే మిగిలిందని ఎంపీ అజ్మీర సీతారాంనాయక్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ క్యాం పు కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పాటు విషయంలో అధికారులకు ప్రతి ఒక్క రు సహకరించాలన్నారు. బయ్యారంలో ఉ క్కు పరిశ్రమ ఏర్పాటు గురించి పార్లమెంటులో లేవనెత్తడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆంక్షలు విధిస్తూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటకు కేంద్రం ఆటంకం కలిగిస్తోందన్నారు. ఆ ప్రాజె క్టు స్థానంలో మరో ప్రాజెక్టు ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ అన్వేషిస్తున్నారని ఎంపీ వెల్లడించారు. 
ఎంసెట్‌ లీకేజిలో మంత్రుల ప్రమేయం లేదు
ఎంసెట్‌–2 పేపర్‌ లీకేజి విషయంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి సంబంధం లేదని ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. లీకేజి విషయంలో వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం త్వరలోనే బయటకు తీసుకువస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం 28 పథకాలను రాష్ట్రంలో నిర్వహిస్తుందని వాటికి సంబంధించిన విధానాన్ని తెలుసుకునేందుకు డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేషన్, మానిటరింగ్‌ కమిటీ (దిశ) అనే కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రణాళికను తయారు చేసిందన్నారు. వచ్చే నెల 13న జిల్లా కేంద్రంలో దిశ ఆధ్వర్యాన సమావేశం జరుగుతుందన్నారు.   కార్యక్రమంలో డాక్టర్‌ బానోత్‌ నెహ్రూ నాయక్, నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, యాకుబ్‌రెడ్డి, సత్తిరెడ్డి, బుల్లెట్‌ ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు