ముగిసిన కళాశాలల వాలీబాల్‌ పోటీలు

16 Sep, 2016 00:44 IST|Sakshi
కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో అండర్‌ –19 బాలబాలికలకు నిర్వహిస్తున్న వాలీబాల్‌ పోటీలు గురువారం ముగిసాయి. పోటీలకు జిల్లా వ్యాప్తంగా 32 బాలబాలికల జట్లు హాజరయ్యాయి. బాలుర విభాగంలో రుక్మాపూర్‌ గురుకుల పాఠశాల, మహాత్మగాం«ధీ జ్యోతిబాపూలే కమలాపూర్‌ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గంగాధర జట్టుప్రథమ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోహెడ జట్టు ద్వితీయస్థానాల్లో నిలిచాయి. సాయంత్రం జరిగిన బహుమతి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య కార్యదర్శి జి.మధుజాన్సన్‌ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫిజికల్‌ డైరెక్టర్లు ఆనంద్, నాగేశ్వర్‌రావు,వెంకటరెడ్డి, సరిత, సుష్మా తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జట్ల జాబితాను కార్యదర్శి ప్రకటించారు. 
 
బాలుర జట్టు: సతీష్‌(రుక్మాపూర్‌), దినేష్,నరేష్, మునీందర్‌(గంగాధర), గణేష్, కార్తీక్‌(గొల్లపల్లి), రాజేష్‌(హుజురాబాద్‌), నరేష్‌(హుస్నాబాద్‌), మహేశ్‌(జూలపల్లి), మారుతి(సుల్తానాబాద్‌), గణేష్, విజయ్‌(కమలాపూర్‌)లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా శౌర్య, శ్రీనివాస్, భగత్, మనోహర్, శివ, సాయిచరణ్‌లు ఎంపికయ్యారు. 
 
బాలికల జట్లు: జ్వాల(హుజూరాబాద్‌), ఆకాంక్ష, నర్మద, శ్రీలేఖ, దివ్య, లహరి, శ్రీవైష్ణవి(కొత్తపల్లి), స్రవంతి, శృతి, మాధురివాణి, సంఘవి(అల్గునూరు), ప్రియాంక(చింతకుంట), అనూష, స్వప్న(నందిమేడారం), పూజ, రిషిత(కరీంనగర్‌)లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా అతిథి, అనూష, సురేఖలు ఎంపికయ్యారు. 
 
బాలికల క్రికెట్‌ జట్టు ఎంపిక...
జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్‌ స్టేడియంలో అండర్‌–19 బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు ముగిశాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారిణులు ప్రతిభ చాటారు. జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి మధుజాన్సన్, వరుణ్‌రావు పాల్గొన్నారు. 
 
నేడు వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు
జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్‌ స్టేడియంలో అండర్‌–19 బాలబాలికలకు వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాశాలల క్రీడాసమాఖ్య కార్యదర్శి మ«ధుజాన్సన్‌ తెలిపారు. 20న అండర్‌–19 బాలబాలికలకు స్టేడియంలోనే ఖోఖో, బాలురకు క్రికెట్‌ జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగల క్రీడాకారులు సంబంధిత తేదీల్లో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.
 
 
>
మరిన్ని వార్తలు