రాజకీయ లబ్ధికోసమే జిల్లాల పునర్విభజన

15 Sep, 2016 22:45 IST|Sakshi
రాజకీయ లబ్ధికోసమే జిల్లాల పునర్విభజన
మునుగోడు : సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మాటలగారడీతో పాలన కొనసాగిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత ఆరోపించారు. గురువారం మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన తరువాత జిల్లా విభజన చేయాల్సిన సీఎం, రాజకీయ లబ్ధికోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్ని ఎత్తులువేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతు రుణాలు మాఫీ చేస్తానని గొప్పలు చేప్పిన సీఎం నేటì కీ పూర్తిస్థాయిలో అమలు చేయకపొవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా రైతుల రుణాలు పూర్తిగా మాఫీచేసి తిరిగి కొత్త రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ కర్నాటి స్వామి, పాలకూరి వెంకన్న, మిర్యాల మధుకర్, ఇటుకలపాటి మధుచౌదరి, యరసాని సైదులు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు