దివీస్‌ రద్దు వరకూ ఉద్యమించాలి

15 Jan, 2017 23:11 IST|Sakshi
  • పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు 
  • తొండంగి :
    కోన ప్రాంతంలో కాలుష్య కారక దివీస్‌ ల్యాబొరేటరీస్‌ను ప్రభుత్వం రద్దు చేసేవరకూ బాధిత గ్రామాల ప్రజలు ఉధృతంగా ఉద్యమించాలని పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు అన్నారు. బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దివీస్‌ రద్దు, అక్రమకేసుల ఎత్తివేత, తదితర డిమాండ్లతో కూడిన కరపత్రాలు విడుదల చేశారు. దివీస్‌ను వ్యతిరేకిస్తూ బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బలప్రయోగానికి దిగడం విచారకరమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేస్తుండడంతో చిన్న, సన్న కారు, పాడిరైతులు, వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులకు నష్టపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 144 సెక్ష¯ŒSను ఆరునెలలుగా అమలు చేయడం, అక్రమకేసులు పెట్టారని, కోర్టులను ఆశ్రయించిన బాధిత రైతు భూముల్లోనూ తోటలను నరికించడం చట్టవిరుద్దమన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధిత గ్రామాల ప్రజలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దివీస్‌ను రద్దు చేయడంతోపాటు ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా వైస్‌ప్రెసిడెంట్‌ ఎ.బాబూరావు, కార్యదర్శి జె.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు