మల్లన్నసాగర్‌ పరిస్థితి సృష్టించవద్దు

2 Aug, 2016 00:05 IST|Sakshi
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి
  • న్యూశాయంపేట : జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం చేపట్టే ప్రభుత్వ భూసేరణను మల్లన్నసాగర్‌ పరిస్థితి మాదిరిగా చేయెుద్దని, అలా చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదరుర్కోవలసి వస్తుం దని ఎఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్తి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
     
    సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భూసేకరణ–నిర్వాసితుల సమస్య అనే అంశం పై పెద్దారపు రమేష్‌ అధ్యక్షతన హన్మకొండలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జీఓ 123 ప్రకారం నిర్బంధంగా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూసేకరణకు పూనుకొందని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా  2013 చట్టాన్ని అమలు చేయాలని డి మాండ్‌ చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జి ల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్‌ ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరించి భూసేకరణ చేస్తే రైతులు చేసే ఉ ద్యమాలకు అండగా వుంటామన్నారు. సీపీఐ జి ల్లా కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ భూసేకరణ జీఓలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ రియల్టర్లకు, పెట్టుబడిదార్లకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. వివిధ పార్టీల నాయకులు ఎన్‌.రెడ్డి, హాంసారెడ్డి, రాజయ్య, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, ఈవి.శ్రీనివాస, రంగయ్య,చుక్కయ్య, రత్నమాల, దుబ్బ శ్రీనివాస సమ్మిరెడ్డి, కట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు