హరితహారంపై నిర్లక్ష్యం వద్దు

19 Aug, 2016 01:05 IST|Sakshi
  • వారంలోగా టార్గెట్లు పూర్తి చేయాలి
  • కలెక్టర్‌ వాకాటి కరుణ
  • హన్మకొండ అర్బన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్‌ వాకాటి కరుణ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో హరితహారంపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
     
    ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వారంలోగా వివిధ స్థాయిల్లో అప్పగించిన టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు కావాల్సిన ఫెన్సింగ్‌ నాటి, నీటి సరఫరా కోసం అవసరమైన నిధులకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదన లు పంపించాలన్నారు. మొక్కలు కావాల్సిన వారు ఇం డెంట్‌ ఇవ్వాలని, ప్రతి మొక్కను జియో ట్యాగింగ్‌ చే యాలన్నారు. కాగా, హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారులకు సహకరించనందుకు రేగొండ పంచాయతీరాజ్‌ ఏఈని సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఈని ఆదేశించారు. వీడియో కాన్ఫరె¯Œæ్సలో జేసీ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, జెడ్పీ సీఈఓ విజయ్‌ గోపాల్, డీఎఫ్‌ఓలు శ్రీనివాస్, పురుషోత్తం, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.‡ 
>
మరిన్ని వార్తలు