వేతన వెతలు

3 Sep, 2016 23:32 IST|Sakshi
వేతన వెతలు

– నెలల తరబడి బిల్లులు మంజూరు కాని వైనం
– కార్యాలయాల చుట్టూ కూలీల ప్రదక్షిణ  
– డబ్బుల్లేవంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం
 – వాటర్‌షెడ్‌ గ్రామాల్లో దయనీయ పరిస్థితి


అనంతపురం టౌన్‌ : జిల్లాలో సమగ్ర వాటర్‌షెడ్‌ యాజమాన్య పథకం (ఐడబ్ల్యూఎంపీ) కింద పని చేస్తున్న కూలీల అవస్థలు అన్నీఇన్నీ కావు. చేసిన పనికి సంబంధించి బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో నానా ఇక్కట్లు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బిల్లులను 15 రోజుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి ఉండడం లేదు. 


ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 109 ప్రాజెక్టుల పరిధిలో 373 పంచాయతీల్లో వాటర్‌షెడ్‌ కింద సుమారు 4600 పనులు జరుగుతున్నాయి. చేసిన పనులకు కూలీలకు వేతనాలు చెల్లించడంలో ఎడతెగని జాప్యం. కొందరు కూలీలకు పోస్టాఫీసుల నుంచి బిల్లుల చెల్లింపు చేస్తున్నారు. మరికొందరికి బ్యాంకుల ద్వారా అందుతోంది. ఉపాధి హామీ పథకం కింద పని చేసిన కూలీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా డ్వామా కార్యాలయంలో ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు. అయితే వాటర్‌షెడ్‌కు ఇక్కడ సిబ్బంది మాత్రం లేరు. మండల స్థాయిలో ఉన్న వారు  కేవలం పే స్లిప్పులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. జిల్లా కేంద్రానికి వస్తే అధికారుల అందుబాటులో లేకపోవడంతో కూలీకు ólతన వెతలు తప్పడం లేదు.

మరిన్ని వార్తలు