‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి

21 Jul, 2016 23:41 IST|Sakshi
‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి
  • హన్మకొండ : తెలంగాణ ప్రాంతం నైజాం పాలన నుంచి విముక్తి పొంది భారత్‌లో విలీనమైన రోజు సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన బీజేవైఎం జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంసెట్‌ పేపర్‌ లీకేజీలో ప్రభుత్వం హస్తముందని ఆరోపిం చారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి కేవీఎల్‌ఎన్‌ రెడ్డి, నాయకులు వల్లభు వెంకన్న, బుర్రి ఉమాశంకర్, పూసల శ్రావణ్, మోడెపల్లి సాయన్న, సురేష్, అశోక్, స్వామి, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు