నిరుపేద ఓసీలకూ రిజర్వేషన్‌ కల్పించాలి

18 Jul, 2016 00:18 IST|Sakshi
నిరుపేద ఓసీలకూ రిజర్వేషన్‌ కల్పించాలి
  • ఓసీ జేఎసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భాస్కర్‌రెడ్డి
  • రేగొండ : అగ్రకులాల్లో పుట్టిన నిరుపేద ఓసీలకు ప్రభుత్వం 19శాతం రిజర్వేషన్‌ కల్పించాలని అగ్రకులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని కొడవటంచలో ఓసీ జేఎసీ మహాగర్జన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి పోలాడి రామారావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సభకు హాజరైన భాస్కర్‌రెడ్డి ఓసీ జేఏసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. నిరుపేద ఓసీల డిమాండ్ల సాధన కోసం రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీలు ఏకమై పోరాడాలని సూచించారు. పోలాడి రామారావు మాట్లాడుతూ ఓసీల సంక్షేమం కోసం ప్రత్యేక కమిష న్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావుతో పాటు మురళీధర్‌దేశ్‌పాండే, కవితారెడ్డి, ఈదులకంటి రమాదేవి, గూడూరి స్వామిరెడ్డి, కొల్గూరి రాజేశ్వర్‌రావు, జైపాల్‌రెడ్డి, కామిడి రత్నాకర్‌రెడ్డి, డి.తిరుపతిరెడ్డి, ఎల్‌.ప్రసాధరావు, బాబురావు, ఎల్‌.రాఘవరెడ్డి, ఎర్రబెల్లి రవీందర్‌రావు, పి.రాజిరెడ్డి, ఎం.కరుణాకర్‌రెడ్డి, ఎం.మమత పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా