శ్రీరాంసాగర్‌ రెండోదశ పనులు వేగవంతం చేయాలి

30 Aug, 2016 23:30 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

 

  • జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌

ఖమ్మం జెడ్పీసెంటర్‌ : శ్రీరాం సాగర్‌ రెండో దశ ప్రధాన కాలువ, బ్రాంచ్‌ కెనాల్‌ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎస్సారెస్పీ ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కాలువ, బ్రాంచ్‌ కెనాళ్ల నిర్దేశిత అలైన్‌మెంట్‌ ప్రకారం పనులు చేపట్టాలని చెప్పారు. రోడ్లు, మిషన్‌ కాకతీయ, ఇతర పనులు వర్షాల కారణంగా సాగడం లేదని, వాటికి సంబంధించిన యంత్రాలను వినియోగించుకుని కాలువ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భక్తరామదాసు ప్రాజెక్టు రెండోదశ, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రైతుల నుంచి తీసుకున్న భూమికి నష్ట పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినందున ఆయా బ్యాంకర్లు రైతు ఖాతాలో డిపాజిట్‌ అయిన సమాచారం తెలుసుకుని వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రామాల్లోకి వెళ్లి రైతుల సమక్షంలో రిజిస్ట్రేషన్‌ ప్రకియను పూర్తి చేయాలన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన భూమిని త్వరగా సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జేసీ దివ్య మాట్లాడుతూ భక్తరామదాసు రెండో దశ, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా రైతుల భూముల్లో చెట్లు, వ్యవసాయ బావి, బోరు బావి, పైపులకు సంబంధించిన నష్ట పరిహారం విలువ సేకరించి నివేదికలు ఇవ్వాలని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. చెట్లు ఉన్న పక్షంలో డీఎఫ్‌ఓ కు వివరాలను అందజేయాలని, మిగతా వాటికి ఇంజనీర్లు నష్టపరిహారం నివేదికను అందించాలని కోరారు. సమావేశంలో ఎస్సారెస్పీ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ చావా శ్రీనివాసరావు, ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్లు వెంకారెడ్డి, వెంకటరెడ్డి,

మరిన్ని వార్తలు