డాక్టర్‌ కర్రి రామారెడ్డికి ‘కీర్తి’ పురస్కారం

3 Feb, 2017 22:42 IST|Sakshi
రాజమహేంద్రవరం రూరల్‌ : 
రాజమహేంద్రవరం ఖ్యాతిని డాక్టర్‌ కర్రి రామారెడ్డి జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ కొనియాడారు.     సరస్వతీపుత్రునిగా, మానసిక వైద్యునిగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఖ్యాతి పొందారని చెప్పారు. తెలుగు వర్సిటీలో  ఫిలాంత్రోపిక్‌ సొసైటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్‌ కర్రి రామారెడ్డికి ప్రతిష్టాత్మక ‘కీర్తి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ముఖ్యఅతిథిగా సుధాకర్‌ మాట్లాడుతూ విద్యా రంగం నుంచి 24 డిగ్రీలు పొంది, మానసిక వైద్య రంగం, సామాజిక రంగాలలో డాక్టర్‌ రామారెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. అంతర్జాతీయ దళిత క్రైస్తవ స్వేచ్ఛా హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ బవిరి చక్రవర్తి మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా వైద్య రంగంలోనే కాకుండా సామాజిక రంగంలోనూ డాక్టర్‌ రామారెడ్డి విశేష సేవలందిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఫిలాంత్రోపిక్‌ సొసైటీ అధ్యక్షుడు అద్దంకి రాజయోనా, మాజీ సర్పంచ్‌ మత్సేటి ప్రసాద్, జిల్లా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ యూనియ¯ŒS అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి, జిల్లా ఎస్సీ రైట్స్‌ ప్రొటెక్ష¯ŒS అధ్యక్షుడు తాళ్ళూరి రవిరాయల్, ఏపీ ట్రా¯Œ్సకో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ విజయకుమార్, నన్నయ్య వర్సిటీ సైకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.వి.ఎస్‌.మణిరమణ, మాజీ ఉప సర్పంచ్‌లు సోమన రాజేశ్వరి, దాకే శ్రీనివాసరావు, మానికిరెడ్డి ఫౌండేష¯ŒS అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, పెదపూడి మణి, అప్పా పరిమళకుమార్, రెవరెండ్‌ లివింగ్‌స్టన్, బి.మురళీధరరావు, బొత్స రామారావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు