కలెక్టర్ చెబితే వినాలా?

17 May, 2016 10:03 IST|Sakshi
కలెక్టర్ చెబితే వినాలా?

- బయోమెట్రిక్ హాజరుపై వైద్యుల వ్యతిరేకత
- ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో వాగ్వాదం

 
 నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యు లు బయోమెట్రిక్ హాజరు విధానంపై మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. అమ లు కాకుండా అడ్డుకుంటున్నారు. సోమవారం ఆస్పత్రిలో వైద్యులు, సూపరింటెండెంట్ మధ్య సమావేశం జరిగింది. బయోమెట్రిక్ హాజరుతో ఎలాంటి ప్రయోజనం లేదని, అమలు చేయవద్దని సూపరిండెంట్‌తో వైద్యులు పేర్కొన్నారు. ఓ వైపు వైద్యుల కొరత ఉందని, మరోవైపు మెడికల్ కళాశాల అనుమతి కోసం ఎంసీఐ పర్యటించే అవకాశం ఉన్న సమయంలో బయోమెట్రిక్ విధానం ఎందుకని సూపరిండెంట్‌ను ప్రశ్నించారు.
 
 జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకా రం బయోమెట్రిక్ అమలు చేయడం తప్పనిసరి అని సూపరిండెంట్ పేర్కొన గా వైద్యులు వాగ్వివాదానికి దిగారు. అత్యవసర వైద్యసేవలు ఉండడంతో బ యోమెట్రిక్ విధానం సాధ్యం కాదని ఓ వైద్యురాలు పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కడ కూడా మెడికల్ కళాశాలలో ఈ విధానం లేనప్పుడు ఇక్కడ ఎందుకు అమలు చేస్తున్నారని అన్నారు. అయినా జిల్లా కలెక్టర్ ఆదేశిస్తే వై ద్యులు వినాలా...అంటూ సూపరింటెండెంట్‌ను నిలదీసినట్లు సమాచారం. మెడికల్ కళాశాలకు డీఎంఈ  ఉండగా కలెక్టర్ ఆదేశాలు ఎందుకు పాటించాలని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని వైద్యులు పరోక్షంగా సూపరింటెండెంట్‌ను నిలదీశారు. కలెక్టర్ ఆదేశాల మేర కు  సూపరింటెండెంట్ ఆస్పత్రిలో బయోమెట్రిక్ హాజరు అనుమతి కోసం డీ ఎంఈకి నివేదించారు. అనంతరం బయోమెట్రిక్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వైద్యులు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరను కలిశారు.
 
 బయోమెట్రిక్ విధానం అమలు చేయవద్దని వైద్యులకు వెసులుబాటు కల్పించాలని కోరగా ప్రిన్సిపల్ అంగీకరించలేదు. తప్పనిసరిగా బయోమెట్రిక్ విధా నం అమలు చేయాల్సిందేనని, కలెక్టర్ ఆదేశాలను పాటించవల్సిందేనని తే ల్చిచెప్పారు. దీంతో వైద్యులు డీఎంఈవోతో మాట్లాడుతామని వెనుతిరిగా రు. సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వాల వైద్యుల సంఘం అధ్యక్షు డు డాక్టర్ గోపాల్‌సింగ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎన్నో సమస్యలు ఉన్నాయ ని, వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఉందని ఇలాంటి సమయంలో బయోమెట్రిక్ విధానం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. అలాగే మెడికల్ కళాశాలకు ఎంసీఐ వచ్చే అవకాశం ఉందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బయోమెట్రిక్ విధానంను కొన్ని రోజుల పాటు వాయిదావేసుకుంటే బాగుంటుందన్నారు.

మరిన్ని వార్తలు