డాక్టర్ల నిర్లక్ష్యంతో వడదెబ్బ బాధితుల మృతి

21 May, 2017 01:01 IST|Sakshi
పాలకొల్లు సెంట్రల్‌ : వడదెబ్బ తగిలిన ఇద్దరు బాధితులు పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటన శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని వెలమగూడెంకు చెందిన అంగ కామేశ్వరరావు (60) వడదెబ్బతో కళ్లుతిరిగి పడిపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. యలమంచిలి మండలం మేడపాడు గ్రామానికి చెం దిన యార్లగడ్డ ఏసురత్నం (50) అనే రిక్షా కార్మికుడు కూడా వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు ఇక్కడికి తరలించారు. వీరిద్దరినీ వైద్యులు సాధారణ వార్డుల్లో ఉంచి చికిత్స చేశారు. అయితే ఐసీయూలో ఉంచినట్టు రికార్డుల్లో చూపించారు. ఈ క్రమంలో శనివారం వేకువ జా మున 4.30 గంటలకు అంగ కామేశ్వరరావు, 6.30 గంటలకు ఏసురత్నం మృతి చెందినట్టు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వీ రిద్దరూ మృతిచెందినట్టు బంధువులు ఆరోపించారు. 
 
>
మరిన్ని వార్తలు