ఉత్తమ పంచాయతీలో అభివద్ధిపై డాక్యుమెంటరీ

20 Jul, 2016 22:21 IST|Sakshi
నర్సీపట్నం (విశాఖపట్నం): దేశంలో ఉత్తమ పంచాయతీగా స్వశక్తీకరణ అవార్డు పొందిన ధర్మసాగరం గ్రామాభివద్ధిపై సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.  దీనిలో భాగంగా బుధవారం పౌరసంబం«ధాల శాఖ అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి డాక్యుమెంటరీ చిత్రికరించారు. ఉపాధి హామీ పథకం నిధులతో 904 నీటి నిల్వకుంటలు, 80 శాతం మరుగుదొడ్లు నిర్మాణం, 70 ఎకరాల్లో టేక్‌ మొక్కలు పెంపకం, గ్రామ ప్రధాన, అంతర్గత రహదారుల్లో వేసిన మొక్కలపై డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారని ఉపాధి హామీ ఏపీవో శ్రీనివాస్‌ తెలిపారు. పౌరసంబంధాలశాఖ అధికారులతో  గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి, ఎంపీపీ సుకల రమణమ్మ గ్రామంలో చేపట్టిన అభివద్ధిని వివరించారు. 
 
 
మరిన్ని వార్తలు