గౌరవ వేతనాలివ్వడంలో నిర్లక్ష్యం తగదు

22 Oct, 2016 00:48 IST|Sakshi
గౌరవ వేతనాలివ్వడంలో నిర్లక్ష్యం తగదు
 - సాక్షర భారత్‌ ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌
 
కర్నూలు సీక్యాంప్‌: సాక్షర భారత్‌ కో-ఆర్డినేటర్లకు  గౌరవ వేతనాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం కర్నూలు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సాక్షర భారత్‌ 7వ అక్షరాస్యత ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా జిల్లాలోని ఎంసీఓ, వీసీవోలకు గౌరవ వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకెళతామన్నారు. సాక్షర భారత్‌ పనితీరులో జిల్లా 12వ స్థానంలో ఉండడం విడ్డూరంగా ఉందన్నారు.  తీసుకురావాలని గౌరవ వేతనాల విషయాన్ని  అసెంబ్లీలో చాలా సార్లు ప్రస్తావించానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఓర్వకల్లు మండలానికి చెందిన పొదుపు మహిళలు సాక్షర భారత్‌ ద్వారా చదువు నేర్చుకుని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సీఆర్‌పీలుగా పనిచేస్తూ మంచి జీతాలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఏజేసీ రామస్వామి, సాక్షార భారత్‌ జిల్లా ఉపసంచాలకులు జయప్రద, డీఆర్‌డీఎ పీవో జ్యోతి, కర్నూలు ఎంపీడీవో మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు