ప్రపంచానికి సర్కస్‌ నేర్పింది దొమ్మరులే

12 Dec, 2016 14:24 IST|Sakshi
ప్రపంచానికి సర్కస్‌ నేర్పింది దొమ్మరులే

పాములపాడు: ప్రపంచానికి సర్కస్‌ నేర్పింది దొంబర కులస్తులేనని దొంబర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి దొంబర కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. 1969కి ముందు విముక్తి జాతుల్లో ఉండేదన్నారు. సంచార జాతులకు ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. గ్రామ స్థాయిలో కుల సమీకరణలు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కుల పెద్దలకు సూచించారు. ఐకమత్యంతో ఉండి సమస్యలు పరిష్కరించుకుంటూ దొంబరుల సత్తా ప్రభుత్వానికి చాటాలన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ వాటా తమకు కేటాయిండం కూడా పక్కనపెట్టేశారన్నారు. సంచార జాతులన్నింటిని సమీకరించి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక కార్పోరేషన్, రెసిడెన్సియల్‌ పాఠశాలల ఏర్పాటు,  ఈ కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర నాయకులు గుర్రప్ప, నాగన్న, మురళి, రవి, సుబ్బరాయుడు, లక్ష్మణ్, ఆంజనేయులు, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు