రక్తదానం.. మరొకరికి ప్రాణదానం

24 Sep, 2016 22:21 IST|Sakshi
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
  • తెయూ వీసీ సాంబయ్య
  • తెయూ(డిచ్‌పల్లి) :
    రక్తదానం మరొకరికి ప్రాణదానమని తెలంగాణ యూనివర్సిటి వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ సాంబయ్య అన్నారు. యువత రక్తదానం చేయడానికి  స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వీసీ ప్రారంభించి ప్రసంగించారు. అత్యవసర సమయంలో ప్రాణాలు దక్కించేందుకు రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రక్తదానం చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌లను అభినందించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ ఆరతి మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందని, 50యూనిట్ల రక్తం సేకరించి ప్రభుత్వ రక్తనిధికి అందజేశామన్నారు. కార్యక్రమంలో  వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం అధికారులు డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, ప్రవీణాబాయి, బాలికల వసతి గృహ వార్డెన్‌ పీ శాంత, ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ డిస్ట్రిక్ట్‌ ప్రొగ్రాం మేనేజర్‌  సీహెచ్‌ సుధాకర్, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు