‘అభినందన’ మందులు వద్దు

30 Aug, 2017 23:30 IST|Sakshi
‘అభినందన’ మందులు వద్దు
- పనిచేయడం లేదని అధికారుల సూచన
- జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ తీర్మానం
 కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం పశువైద్యానికి నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుదర్శన్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో మందుల సరఫరాపై జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అభినందన అనే కంపెనీకి చెందిన మందులు నాణ్యత లేవని, రోగాలపై అసలు పనిచేయడం లేదని వీటిని జిల్లాకు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు. అలాగే అభినందన కంపెనీ మందులు జిల్లాకు అవసరం లేదని కమిటీ తీర్మానం చేసింది.
 
రేట్‌ కాంట్రాక్టు ఉన్న 50 కంపెనీల్లో కొన్ని కంపెనీల మందులు బాగా పనిచేస్తున్నాయని వాటిని తెప్పించాలని కమిటీ సభ్యులు సూచించారు. జేడీ మాట్లాడుతూ జిల్లాలోని నాణ్యమైన, బాగా పనిచేసే వాటినే తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ డీడీలు సీవీ రమణయ్య, పి.రమణయ్య, జీవీ రమణ, వరప్రసాద్, గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్‌ చంద్రశేఖర్, వెటర్నరీ పాలిక్లినిక్‌ డీడీ హమీద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు