చెట్టు తల్లి.. చెమ్మగిల్లి

8 Aug, 2016 23:11 IST|Sakshi
చెట్టు తల్లి.. చెమ్మగిల్లి
కడెం : చెట్టు తల్లి రోదనలు చెవిన పట్టించుకున్నారు. సహదయంతో స్పందించారు. చెట్టుకు ప్రాణం ఉంటుందని చెట్టూ ప్రాణం పోస్తుందని ప్రచారం చేస్తున్నారు. చెట్లను నరకవద్దని వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి పలువురి మన్ననలు పొందుతున్నారు అటవీశాఖ సిబ్బంది. విలువైన కలపను నరకవద్దు.
కలపను నరికితే అడవి తల్లి రోదిస్తుంది. ఒక చెట్టును నరికితే దాని పర్యవసనం అనేక కష్టాలు. అంటూ వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది అటవీశాఖ. టైగర్‌ జోను పరిధిలోని కడెం అటవీ క్షేత్రంలోని దోస్తునగర్‌ గ్రామ సమీపంలో ఇందన్‌పల్లి క్రాసింగు వద్ద ప్రధాన రహదారి పక్కన కళాత్మక సందేశాన్నిస్తున్నట్లుగా అందమైన శిల్పాలను ఏర్పాటు చే శారు.
స్మగ్లర్లు అడవి తల్లిని రంపంతో కోస్తుంటే దాని నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లుగా,ఆ చెట్టు పిల్ల రోదిస్తున్నట్లుగా శిల్పాలను పెట్టారు. వీటిని కొద్దిరోజుల క్రితమే అటవీ శాఖ వారు పెట్టించారు. ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో అందరి దష్టిని ఆ శిల్పాలు ఎంతో ఆకర్షిస్తున్నాయి.
 
 
మరిన్ని వార్తలు