రైల్వే పాఠశాల రద్దు చేస్తే సహించం

28 Jul, 2016 00:09 IST|Sakshi
 
 
బిట్రగుంట : బిట్రగుంటలో 110 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాల విషయంలో అధికారుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని, పాఠశాలను రద్దు చేసినా, స్థాయి తగ్గించేలా నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదని రైల్వే అభివద్ధి కమిటీ సభ్యులు హెచ్చరించారు. బోగోలులో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన రైల్వే పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో వారితోపాటు కమిటీ సభ్యులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. రైల్వే పాఠశాలలో ఈవిద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతిలో విద్యార్థులను చేర్చుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఏడు నుంచి పదోతరగతి వరకూ ప్రస్తుతం 130 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన రైల్వే కార్మికులు, విశ్రాంత కార్మికుల పిల్లలేనని వివరించారు. అతితక్కువ వ్యయంతో రైల్వే కార్మికుల పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్న పాఠశాల విషయంలో అధికారుల తీరు పూర్తిగా అనుమానాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి ఏకే జయరాజ్, సభ్యులు షేక్‌ నూరుద్దీన్, యతిరాజులు నాయుడు, బొంతా సుధీర్, మహబూబ్‌బాష, రషీ, ముగ్ధుమ్, రవూఫ్, ఖాన్‌ పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు