ఆందోళన చెందొద్దు

10 Nov, 2016 00:32 IST|Sakshi
ఆందోళన చెందొద్దు
  •  డిసెంబర్‌ 31 వరకు నోట్లు మార్చుకోవచ్చు 
  • టోల్‌ప్లాజాల్లో టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదు
  •  శని, ఆదివారాల్లో బ్యాంక్‌ సేవలు
  •  సమస్యలెదురైతే 1090, 1091ను సంప్రదించండి
  •  బ్యాంకర్లు, వ్యాపార సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఎస్పీ  
  •  
    నెల్లూరు(క్రైమ్‌):  
    డిసెంబర్‌ 31వ తేదీ వరకు రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే కొందరు అవి చెల్లవని ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోన్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో ఆయన బుధవారం రాత్రి బ్యాంక్‌ అధికారులు, పోస్ట్‌మాస్టర్‌ జనరల్, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ట్రేడ్‌యూనియన్లు, వ్యాపారసంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం‡ ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అయితే వాటిని రద్దు చేసినా నోట్ల విలువ మారదన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎవరైనా ప్రజలు తమ అవసరాలకు  రూ. 500, రూ 1,000 నోట్లు నిర్ణీత గడవు లోపల ఇస్తే వ్యాపార వర్గాలు, బ్యాంక్‌లు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నోట్ల మార్పిడితో సహా అన్ని లావాదేవీలు సజవుగా జరిగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని వర్గాలతో కలిసి సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీనియర్‌ బ్యాంక్‌ అధికారులు ఆర్‌బీఐ నిబంధనల మేరకు అదనపు కౌంటర్‌లు, అదనపు సమయంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని ఆర్టీసీ, రైల్వేస్టేషన్‌లు, మీసేవ, హాస్పిటల్స్‌తో పాటు అన్నీ నిత్యావసర విభాగాల వ్యాపార సంస్థల్లో రూ. 500, రూ1000నోట్లు స్వీకరించబడుతాయన్నారు. 11వ తేదీ వరకు టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అన్నీ బ్యాంకులు ప్రజల సౌకర్యం కోసం  శని, ఆదివారాల్లో కూడా పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1090, 1091లకు ఫోనుచేయ్యవచ్చని తగిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్పీ బి. శరత్‌బాబు, బ్యాంక్‌ సీనియర్‌ అధికారులు, పోస్టుమాస్టర్‌ జనరల్, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, వ్యాపార సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 
     
     
మరిన్ని వార్తలు