వ్యర్థాలతో చేపల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి

27 Oct, 2016 21:05 IST|Sakshi
వ్యర్థాలతో చేపల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి

కైకలూరు : చేపల సాగులో మేతగా వ్యర్థాలను వినియోగించే రైతులు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు అన్నారు. స్థానిక బృందావన్‌ లాడ్జిలో సంఘ నాయకులు, చేపల రైతులతో కలసి ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యర్థాల సాగు కారణంగా మొత్తం చేపల పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుందన్నారు. ఫంగాసీస్‌ చేపల సాగులో వ్యర్థాలను కొందరు రైతులు వాడుతున్నారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. వ్యర్థాలతో సాగు చేస్తే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు. సమీప రైతులు వ్యర్థాలతో మార్కెట్‌లో జరిగే నష్టాలను వివరించాలన్నారు. చేపల చెరువుల లైసెన్సులు నిమ్తితం రూ.700లతోపాటు ఆటో క్వాడ్‌ చెల్లించినవారికి అనుమతులు రాకపోతే గుడివాడ రోడ్‌లోని సంఘ కార్యాలయంలో వివరాలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సెక్రటరీ చింతపల్లి అంకినీడు, కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి అప్పారావు, భాస్కరవర్మ, ఘంటా సత్యనారాయణ, పాలచర్ల శ్రీనివాసచౌదరీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






 

మరిన్ని వార్తలు