గోదావరికి తగ్గిన ప్రవాహ జలాలు

16 Aug, 2016 01:23 IST|Sakshi
కొవ్వూరు : గోదావరి నదిలోకి ఎగువ నుంచి వచ్చే ప్రవాహ జలాలు (ఇన్‌ ఫ్లో) తగ్గుముఖం పట్టాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు 2,22,341 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో సోమవారం సాయంత్రానికి 1,86,805 క్యూసెక్కులకు తగ్గింది. ఇందులో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 14,400 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4,600, సెంట్రల్‌ డెల్టాకు 2,500, పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్టకు గల 175 గేట్లను 0.30 మీటర్ల ఎత్తులేపి 1,72,405 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
 
>
మరిన్ని వార్తలు