శిథిలావస్థలో గ్రంథాలయ భవనం

27 Jul, 2016 17:37 IST|Sakshi
శిథిలావస్థలో గ్రంథాలయ భవనం
  • కనీస వసతులు కరువు
  • పట్టించుకోని అధికారులు
  • ఇబ్బందుల్లో పాఠకులు
  • తానూరు: మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు లేక పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అధికారి గుండెపోటుతో మతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రంథాలయానికి అధికారిని నియమించ లేదు. దీంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    కుబీర్‌ మండల గ్రంథాలయాధికారికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించడంతో అయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో గ్రంథాలయంలో తగిన సౌకర్యాలు లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయంలో పలు మార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని పాఠకులు వాపోతున్నారు.
    శిథిలావస్థకు చేరిన భవనంలో...
    మండల కేంద్రంలో గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన వ్యవసాయ గోదాంలోని పాత  భవనంలో గ్రం«థాలయం కొనసాగిస్తున్నారు. గ్రంథాలయంలో పాఠకులకు సరిపడేంత సౌకర్యాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రంథాలయం కోసం స్థలం కేటాయిస్తే  గ్రం«థాలయం నిర్మిస్తామని అధికారులు చేప్పడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో పాటు మెంబర్‌లు స్థలం అందించేందుకు ఎకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నత శాఖ అధికారులకు నివేదికలు పంపించారు. కాని ఇప్పటి వరకు గ్రంథాలయ భవనం మంజూరి కాలేదని స్థానికులు తెలిపారు. గ్రంథాలయం వెనుక భాగంలో ప్రయాణికులు మలవిసర్జన చేయడంతో దుర్గంధం నెలకొందని పాఠకులు వాపోతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో గ్రంథాలయం కొనసాగించడంతో  వర్షం కురుస్తే నీరు గ్రంథాలయంలోకి చేరుతోంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    అధికారిని నియమించాలి...
    మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తిచేసేవిధంగా చూడాలని పాఠకులు వాపోతున్నారు. అధికారి లేకపోవడంతో పాఠకులకు కనీస సౌకర్యాలు, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రంథాలయానికి అధికారిని నియమించి, నూతన  భవనం ఏర్పాటు చేసి పాఠకుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
    – సమస్య పరిష్కరించాలి   
    గ్రంథాలయంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తిచేసి పాఠకుల సమస్యలు పరిష్కరించాలి. అధికారి లేకపోవడంతో గ్రంథాలయంలో తగిన పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అధికారిని నియమించి పాఠకుల సమస్య పరిష్కరించాలి.
    27ఎండీఎల్‌152, మానిక్, తానూరు
    – నూతన భవనం నిర్మించాలి  
    గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన భవనం నిర్మించి,  గ్రంథాలయంలో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి పాఠకుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
    27ఎండీఎల్‌153, కాత్రే రమేష్‌ 
     
మరిన్ని వార్తలు