ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన

16 Nov, 2016 00:52 IST|Sakshi
– అందుబాటులోకి రాని ఫారం–6 దరఖాస్తులు
– ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం
 
కర్నూలు(అగ్రికల్చర్‌):  ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. అన్ని తహసీల్దారు కార్యాలయాలకు ముసాయిదా ఓటర్ల జబితాలను పంపారు. తహసీల్దార్లు, ఎలొక్ట్రో రోల్‌ రిజిష్ట్రేషన్‌ అధికారులు ఫారం–5 నోటీసును నోటీసు బోర్డుల్లో పెట్టారు. వెంటనే ఓటర్ల నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులు అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు దరఖాస్తులు హైదరాబాద్‌ నుంచే  వస్తాయని భావించారు. అయితే చివరికి జిల్లా స్థాయిలోనే ముద్రించుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించడంతో తాజాగా అన్ని రకాల దరఖాస్తులను ముద్రించాల్సి ఉంది. మాన్యువల్‌గా దరఖాస్తుకు కొంత సమయం పడుతోంది. అయితే ఆన్‌లైన్‌  (ఠీఠీఠీ.nఠిటp.జీn లేదా ఠీఠీఠీ.ఛ్ఛి్చౌnఛీజిట్చ.nజీఛి.జీn) ద్వారా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు  సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులుపేర్కొంటున్నారు. 
కొత్తగా రెండు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు:
 జిల్లాలో ఇటీవలి వరకు 3539 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా ఇవి 3541కి పెరిగాయి. ఆదోని అసెంబ్లీ నియోజక వర్గంలో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.  
 
>
మరిన్ని వార్తలు