మునిగిన కోటిలింగాల లోలెవల్‌ వంతెన

2 Aug, 2016 22:48 IST|Sakshi
మునిగిన కోటిలింగాల లోలెవల్‌ వంతెన
వెల్గటూరు : వెల్గటూరు మండలంలోని కోటిలింగాల ప్రధాన రహదారిలో అలుగు ఒర్రెపై ఉన్న లో లెవల్‌వంతెన ఎల్లంపెల్లి బ్యాక్‌ వాటర్‌లో మంగళవారం మునిగిపోయింది. గ్రామానికి బయట నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రజలు వంతెన పైనుంచి మూడు ఫీట్ల లోతు నీళ్లతో నడిచి వెళ్తున్నారు. నీటిమట్టం పెరుగుతున్నందున స్కూల్‌ ఆటోలు మధ్యాహ్నమే పిల్లలను దిగబెట్టి వెళ్లాయి. బుధవారం తెల్లవారేసరికి నీటిమట్టం మరింత పెరిగి కోటిలింగాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి. నాలుగు రోజులుగా వంతెన మునిగి పోతుందని అధికారులను ‘సాక్షి’ హెచ్చరిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటం గమనార్హం. రాకపోకలు నిలిచిపోవటంతో నిర్వాసితులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. సంబంధిత అధికాకరులు స్పందించి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. 
 
 
మరిన్ని వార్తలు