భీమవరంలో ’డ్రగ్స్‌’ తనిఖీలు

22 Jul, 2017 22:04 IST|Sakshi
భీమవరంలో ’డ్రగ్స్‌’ తనిఖీలు
భీమవరం టౌన్‌: భీమవరంలో శనివారం ఔషధ నియంత్రణ అధికారుల బృందం మందుల దుకాణాలు, హోల్‌సేల్స్‌ ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు చేశారు. జిల్లా ఔసధ నియంత్రణ విభాగం ఏడీ వి.విజయశేఖర్‌ నేతృత్వంలో భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కె.అనిల్‌కుమార్, విక్రమ్, ఎం.విజయలక్ష్మిల బృందం తనిఖీలు చేశాయి. డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హ్యాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ (మత్తు కలిగించే మందులు)ను ఏ వ్యాపారులు ఎక్కువ మొత్తంలో క్రయవిక్రయాలు చేస్తున్నారో రికార్డులను పరిశీలిస్తున్నారు. భీమవరం వన్‌టౌన్, టూటౌన్‌ ప్రాంతాల్లో పలు మందుల దుకాణాలు, హోల్‌సేల్‌ ఏజెన్సీల్లో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందుల విక్రయించాల్సి ఉండగా దానిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న దిశగా కూడా అధికారులు దృష్టిసారించారు. 
 
మరిన్ని వార్తలు