బకాయిలను త్వరగా జమ చేయండి

4 Mar, 2017 23:36 IST|Sakshi
బకాయిలను త్వరగా జమ చేయండి
– డీసీ గాయత్రిదేవి
కర్నూలు(న్యూసిటీ): దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెల్లించ వలసిన సర్వశ్రేయోనిధి ఫండ్‌(సీజీఎఫ్‌), అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ బకాయిలను వెంటనే జమ చేయాలని ఆ శాఖ ఉప కమిషనర్‌ బి.గాయత్రిదేవి కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. శనివారం పాతబస్టాండ్‌లోని నగరేశ్వరస్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సహాయ కమిషనర్‌ సి.వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రిదేవి మాట్లాడుతూ.. 6ఎ, 6బి గ్రూపు పరిధిలోని దేవాలయాల్లో సర్వశ్రేయోనిధి ఫండ్, అర్చక వెల్ఫేర్‌ ఫండ్, ఇఎఎఫ్‌ ఫండ్‌ ఎంత వసూలు అయిందని కార్యనిర్వహణాధికారులను ప్రశ్నించారు. కమిషనర్‌ వై.వి.అనురాధ ఆదేశాల ప్రకారం సీజీఎఫ్, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ బకాయిలను దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు. మిగిలిన నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలన్నారు.
 
దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్‌ కార్యాలయం సూపరింటెండెంట్లు పాండురంగారెడ్డి, తిరుమలరెడ్డి, సహాయ కమిషనర్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ బి.సుధాకర్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారులు ఎస్‌.సత్యనారాయణ, ఎం.రామాంజనేయులు, శోభ, స్వర్ణముఖి, డి.ఆర్‌.కె.వి.ప్రసాద్, గుర్రొడ్డి, తిమ్మనాయుడు, సుబ్రహ్మణ్యేశ్వర నాయుడు, ఉరుకుంద ఈరన్న, దేవస్థానం సూపరింటెండెంట్‌ మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్లు హరిచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు