దుండగుల కోసం ముమ్మర గాలింపు

17 Jul, 2016 23:12 IST|Sakshi
దుండగుల కోసం ముమ్మర గాలింపు

దుండగుల కోసం ముమ్మర గాలింపు
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండల కేంద్రంలోని బజారువీధిలో వెలసిన శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో శనివారం అలజడి  సృష్టించిన ఎనిమిది మంది దుండగుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఆలయం పైకప్పుకు ఏర్పాటుచేసిన రాతిమొగ్గను దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో అరెస్టయిన తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన సద్దాంహుస్సేన్, యాదమరి మండలం 184 గొళ్లపల్లెకు చెందిన వినాయకం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదమరి మండలం 184 గొళ్లపల్లికి చెందిన వినాయకం చౌడేపల్లె మండలంలోని చెడుగుట్ల పల్లెకు వెళ్లే రోడ్డులో ఉన్న ఒక రైతు పొలంలో పనులు చేసుకుంటున్నాడు. అతనికి అర క్కోణంకు చెందిన జయకుమార్‌ పరిచయమయ్యాడు. అతని ద్వారా అరక్కోణం నుంచి కమల్, దేవా, సద్దాంహుస్సేన్, పురుషోత్తంబాబు, ప్రభాకర్, ప్రకాష్‌ను రప్పించినట్లు తెలుస్తోంది. వీరు ఆలయంలో ఉన్న రాతి మొగ్గలో వజ్రాలున్నాయని, దాన్ని అపహరించుకు వెళ్లాలని పథకం వేసినట్లు సమాచారం. ఈ మేరకు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం చౌడేపల్లెకు చేరుకుని నాలుగు ద్విచక్ర వాహనాల్లో బోయకొండకు Ðð ళ్లారు. సాయంత్రం వరకు అమ్మవారి ఆలయ పరిసరాల్లో గడిపి తిరిగి మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే రాతి మొగ్గను ధ్వంసం చేశారు. అర్చకులు, స్థానికులు అప్రమత్తమై దుండగుల్లో సద్దాం హుస్సేన్, వినాయకంను పట్టుకున్నారు.
స్థానికుల హస్తంపై ఆరా
పట్టణం నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయంలోకి తమిళనాడుకు చెందిన వారు ప్రవేశించడానికి స్థానికుల హస్తం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది రూ.కోట్లు విలువ చేసే ఏడు పడగల నాగదేవత విగ్రహం లభ్యం కావడం సంచలనం రేపింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 12న దొరబావి తోపు వద్ద గల పార్వేట మండపాన్ని దుండగలు డిటోనేటర్లతో పేల్చివేశారు. వాటితో కూడా ఈ ముఠాకు సంబంధాలున్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
 ఆలయ భద్రతకు ప్రత్యేక చర్యలు
 ఆలయంలో భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు అర్చకులు రాజశే«ఖర దీక్షితులు, కుమారస్వామి, మహేష్‌స్వామి ఆదివారం తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు