మళ్లీ నకిలీ ఆయుర్వేదం

11 Aug, 2016 18:12 IST|Sakshi
  • చికిత్స చేస్తున్న అనుమతి లేని వైద్యులు
  • పట్టించుకోని అధికారులు!
  • ఖానాపురం : మండల కేంద్రంలో అనుమతి లేని ఆయుర్వేదం మళ్లీ జోరందుకుంటుంది. నెల రోజుల క్రితం ‘అనుమతి లేని ఆయుర్వేదం’ శీర్షికన సాక్షిలో వరుస కథనాలు రావడంతో జిల్లా ఆయూష్‌ అధికారులు స్పందిం చారు. మండల కేంద్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆయుర్వే వైద్యాన్ని పరిశీలించారు. ఆయూష్‌ అధికారుల పరిశీలనలో ఒక్కరూ అర్హులు కారనే విషయాన్ని గుర్తించి షాపులను మూసివేయాలని హెచ్చరించి, వివరాలు సేకరించారు.

    ఆ తర్వాత కొన్ని రోజులు వైద్యాన్ని నిలిపివేశారు. తిరిగి  కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ వైద్యాన్ని ప్రారంభించారు. బుధవారం కరీంగనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వృద్ధులు అధిక సంఖ్యలో వచ్చారు. అనుమతి లేకున్నా విచ్చలవిడిగా వైద్యాన్ని నడిపిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయూష్‌ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  
మరిన్ని వార్తలు