ఎర్రచందనం పేరుతో ఘరానా మోసం

4 Nov, 2015 18:16 IST|Sakshi

విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తుమ్మ దుంగలనే ఎర్ర చందనంగా చూపి విక్రయిస్తున్నఓ ముఠాను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.

నర్సీపట్నం ధర్మసాగరం వద్ద కొందరు ఎర్రచందనం దుంగలంటూ తుమ్మ కలపను అమ్ముతున్నారని చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నర్సీపట్నం పోలీసులు ఓ కలప డిపోపై దాడి చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా కాగా, ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లని పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు