దుర్గాదేవి ఆలయంలో చోరీ

24 Sep, 2016 00:21 IST|Sakshi
నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామపరిధిలోని దుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి  దుర్గాదేవి మీద ఉన్న రూ. 50 వేల విలువచేసే బంగారు, వెండి ఆభరాణాలతో పా టు ఆలయంలోని సీలింగ్‌ ఫ్యా¯ŒS ఎత్తుకెళ్లారు. ఆలయం ముందున్న హుండీని పగులగొట్టి డబ్బులను అపహరించారు. శుక్రవారం పూజకు వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారమివ్వడంతో వారు ఎస్సై రాజుకుమార్‌కు ఫిర్యాదు చేయగా ఆలయానికి వెళ్లి పరిశీలించారు. దొంగలను పట్టుకొని చర్య తీసుకోవాల ని సర్పంచ్‌ కనకం హైమావతి, ఎంపీటీసీ పాశం వీరయ్య, గోపాల్‌రెడ్డి, రమేష్‌ కోరారు.  
మరిన్ని వార్తలు