పాట్లు ఫీట్లు

23 Sep, 2016 09:12 IST|Sakshi
పాట్లు ఫీట్లు
  • అన్నప్రసాదం భక్తులకు  నరకయాతన
  •  బురదలో అడుగేస్తే  జారిపడాల్సిందే
  •  దుర్గగుడి అధికారులకు పట్టని వైనం
  •  
    ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలంటే భక్తులకు సర్కస్ ఫీట్లు తెలిసి ఉండాల్సిందే. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఆస్పత్రిపాలు కావాల్సిందే. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో అర్జున వీధి అడుగు మేర బురద, మట్టి పేరుకుపోయింది.

    దీంతో అడుగు తీసి అడుగు వేయ డం కనాకష్టమైంది. తేడా వస్తే జారిపడిపోతున్నారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఘాట్‌రోడ్డు మీదుగానే కొండ కిందకు చేరుకుంటున్నారు.. అయితే  అన్న ప్రసాదాన్ని మాత్రం అర్జున వీధిలోని శృంగేరీమఠంలోనే కొనసాగిస్తుండటంతో అక్కడకు వెళ్లాలంటే బురద లో నడిచి వెళ్లాలి.
     
    ఓ చంకలో  బట్టల బ్యాగు, మరో చంకలో చంటి పిల్లలతో బురదలో నడుచుకుంటూ వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపున బురదలో నడుచుకుంటూ వెళ్లలేక కొంత మంది భక్తులు రోడ్డుకు పక్కనే ఉన్న సిమెంట్ గొట్టాల పైకి ఎక్కి బురదను దాటేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో కొంత మంది పైపు పై నుంచి జారి పడి బురదలో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
     


    భక్తుల ఇబ్బందులు కనిపించవా?
    కనీసం భక్తులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా అన్నదాన సిబ్బంది కనీసం భక్తులు నడిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గమనార్హం. మరోవైపు నిత్యం రద్దీగా  కనిపించే అన్నదానం క్యూలైన్లు గురువారం వెలవెలబోయాయి. దేవస్థానం రూ. 40 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డు ఖాళీగానే ఉన్నప్పటికీ శృం గేరీ మఠంలోనే అన్నదానం చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు  భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


     
    అన్నదాతకు అపచారం... మౌనస్వామిని వదిలేశారిలా  
    ఇంద్రకీలాద్రి: తొలినాళ్లలో దుర్గమ్మ భక్తులకు అన్నదానం చేసిన మౌన స్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఆలయ అధికారులు ఆరు బయట పడేశారు. దీంతో ఎండకు  ఎండుతూ.. వానకు తడుస్తూ ఉంది. కొండపై మందిరంలో ఉన్న మౌన ముని స్వామి మందిరాన్ని పుష్కరాలకు ముందు దుర్గగుడి అధికారులు కూల్చేయడం  తెలిసిందే.

    దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మౌన ముని విగ్రహాన్ని అర్జున వీధిలోని శంగేరీ మఠంలో నిర్వహిస్తున్న అన్నదాన భవనానికి తరలించారు. రంగులు వేసిన తర్వాత ఇలా ఆరు బయట పడేయడం సరికాదని, దీనికి తగిన షెడ్డు  ఏర్పాటు చేసి మౌన ముని స్వామి వారి చరిత్ర అందరికీ తెలిసేలా  బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు