నగదురహిత లావాదేవీకు సమాయత్తం

25 Nov, 2016 23:35 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : చిల్లర సమస్యను అధిగమించేందుకు జిల్లాలో పూర్తిస్థాయిలో నగదురహిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు ప్రజలను సమాయత్తం చేస్తున్నామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 1 నుంచి రేషన్‌డిపోలు, ఫెర్టిలైజర్స్‌ షాపులు, కిరాణా షాపుల్లో పూర్తిస్థాయిలో నగదురహిత లావాదేవీలు నిర్వహించేలా స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అన్ని రేషన్‌డిపోలు, ఫెర్టిలైజర్‌ షాపులు, వ్యాపార సంస్థల్లో కరెంట్‌ అకౌంట్‌లు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలంలో 33, పాలకొల్లులో 34 రేషన్‌ డీలర్‌ షాపులుండగా అందులో ఏ ఒక్కటీ కూడా కరెం‍ట్‌ అకౌంట్‌ ప్రారంభించకపోవడంపై తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జేసీ పి.కోటేశ్వరరావు, డీఆర్వో కె.హైమావతి, డీఎస్‌వో డాక్టర్‌ డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు