మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ

4 Sep, 2016 00:48 IST|Sakshi
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
 
  • కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
  • కేఎన్నార్‌ విద్యార్థులకు మట్టి విగ్రహాల పంపిణీ
 
నెల్లూరు, సిటీ: పర్యావరణ పరిరక్షణకు ^è వితి ఉత్సవాలను మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని భక్తవత్సల్‌నగర్‌లోని కురుగుండ్ల నాగిరెడ్డి(కేఎన్‌ఆర్‌) ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు శనివారం  మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ బొమ్మలకు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నామన్నారు. మట్టి విగ్రహాలతో ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
స్వర్ణభారతి ట్రస్ట్‌ తరుపున రూ.లక్ష విరాళం అందిస్తాం
కేఎన్నార్‌ పాఠశాలలో కంప్యూటర్లు, ఇతర సౌకర్యాల కోసం స్వర్ణభారతి ట్రస్ట్‌ తరుపున రూ.లక్ష విరాళంగా అందజేస్తానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన వసతులను తన దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయుడ్ని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, టీడీపీ నాయకులు కిలారీ వెంకటస్వామినాయుడు, కార్పొరేటర్లు , తదితరులు పాల్గొన్నారు.
 వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం 
వెంకటాచలం: స్వర్ణభారత్‌ ట్రస్టు, బీవీ రాజు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాచలంలోని సరస్వతీనగర్‌లో∙నిర్మించిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కోసం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో వెంకటాచలంలో తక్కువ ఖర్చుతో మోడల్‌ గృహ సముదాయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడ్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ముత్యాలరాజు, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలోబీఎంటీపీసీ సంస్థ ఈడీ శైలేష్‌కుమార్‌ అగర్వాల్, నెల్లూరు నగర మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్, స్వర్ణభారత్‌ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్, ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, గృహనిర్మాణాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు