ప్రారంభమైన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

27 Aug, 2016 23:05 IST|Sakshi
ధ్రువీకరణ పత్రం అభ్యర్థికి అందజేస్తున్న ఇన్‌చార్జి వైఎస్‌ చాన్సలర్‌ మిర్యాల చంద్రయ్య
ఎచ్చెర్ల: బీఎడ్‌ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎడ్‌ సెట్‌ –2016 ప్రారంభం అయ్యింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం కావలసి ఉండగా, జాతీయ సమాచార కేంద్రం నుంచి సర్వర్‌ అనుసంధానం కాలేదు. అభ్యర్థులు మాత్రం ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఎట్టకేలకు 12.30కి సర్వర్‌ అనుసంధానం చేశారు.
 
వర్సిటీ ఇన్‌చార్జి వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య కౌన్సెలింగ్‌ ధ్రువీకరణ పత్రం విద్యార్థులకు అందజేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన ప్రారంభించగా, 65 మంది అభ్యర్థులు హాజరయ్యారు. శనివారం గణితం, ఇంగ్లిష్‌ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఆదివారం ఫిజకల్‌ సైన్స్, బయోలాజికల్‌ సైన్స్, సోమవారం సోషల్‌ స్టడీస్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు షెడ్యూల్‌ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఆదివారం గణితం, ఇంగ్లిష్, 29న ఫిజికల్‌సైన్స్, బయోలాజికల్‌సైన్స్, సోషల్‌ స్టడీస్‌ అభ్యర్థుల ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గుంట తులసీరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ హెచ్‌.సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్, జేఎల్‌.సంధ్యారాణి, రోణంకి శ్రీధర్, ప్రొఫెసర్‌ ఎం.ప్రభాకరరావు, జి.రామకృష్ణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు